అక్షరటుడే, కామారెడ్డి : Heavy Rain | కామారెడ్డి (Kamareddy) జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం ఉదయం ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, తాడ్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో భారీగా వర్షం పడుతోంది. కామారెడ్డి పట్టణంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. డ్రెయినేజీల నుంచి వచ్చిన నీరంతా ప్రధాన రహదారులపై చేరింది. రైల్వే కమాన్, స్టేషన్ రోడ్, సిరిసిల్ల రోడ్డు, నిజాంసాగర్ చౌరస్తా, అశోక్ నగర్ కాలనీ కలెక్టరేట్ వెళ్లే రహదారులు నీటితో నిండిపోయాయి.
Heavy Rain | రైతుల ఆందోళన
జిల్లాలో చేతికొచ్చిన వరి పంటను కోయడానికి రైతులు (Farmers) సిద్ధమయ్యారు. కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో వర్షం పడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటను కోయడానికి రైతులు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. పంట కోస్తే ధాన్యం తడిసిపోయే అవకాశాలు ఉన్నాయి. కోయకుండా వదిలేస్తే వర్షానికి పంట నేలవాలడంతో పాటు గింజలు రాలిపోయే అవకాశం ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.