అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Rains | హైదరాబాద్ (Hyderabad)లో మరోసారి భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. శనివారం అర్ధరాత్రి నుంచే నగరంలో వాన పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మహా నగరంలో ఇటీవల భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. మూసీ నది (Musi River) ఉధృతికి చాలా ప్రాంతాలు నీటమునిగాయి. మరోసారి వరుణుడు భాగ్యనగరంపై ప్రతాపం చూపుతున్నాడు. శనివారం రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. తెరిపినివ్వకుండా వాన పడుతుండటంతో నగరం అతలాకుతలం అయింది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.
Hyderabad Rains | ముంచెత్తిన వరద
భారీ వర్షాలతో నగరంలోని తోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, కూకట్‌పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్, చింతల్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హైడ్రా (Hydraa), జీహెచ్ఎంసీ (GHMC) సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. జూబ్లీహిల్, ఫిలింనగర్, యూసఫ్‌గూడ, మణికొండ, పెన్షన్ ఆఫీస్, ఖైరతాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.
Hyderabad Rains | అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. సాయంత్రం పూట నగరంలో కుండపోత వాన కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.