అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain in Hyderabad | భాగ్యనగరంలో భారీ వర్షం దంచికొట్టింది. ఆదివారం (సెప్టెంబరు 14) సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయి కుంభవృష్టి కురిసింది.
భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మియాపూర్, కూకట్‌పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, అమీర్‌పేట్ Ameerpet, పంజాగుట్టలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. గండమైసమ్మలో వర్షం ఇంకా దంచికొడుతోంది.
కుషాయిగూడ, కాప్రా, ఏఎస్‌రావు నగర్, చర్లపల్లి, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, లాలాపేట్, తార్నాక, నల్లకుంట, అంబర్‌పేట, కాచిగూడ, ఉప్పల్, టోలీచౌకి, శేరిలింగంపల్లి, హైటెక్ సిటీ Hi-Tech City లో భారీగా ట్రాఫిక్‌జామ్ Heavy traffic jams అయింది.
బోడుప్పల్, పీర్జాదిగూడ, పోచారం, నారపల్లి, బషీర్‌బాగ్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్, బేగం బజార్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, మణికొండ, గచ్చిబౌలిలోనూ భారీ వర్షం కురిసింది.
Heavy rain in Hyderabad | 12 సెం.మీ. వర్షపాతం..
హైదరాబాద్ Hyderabad లో గంటల వ్యవధిలో 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. గచ్చిబౌలిలో గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. దోమలగూడ, చిక్కడపల్లి, గాంధీనగర్‌లో కాలనీలు నీటమునిగాయి.
Heavy rain in Hyderabad | విషాదం నింపిన భారీ వర్షం..
ఆసిఫ్‌నగర్ అఫ్జల్‌సాగర్‌లోని మంగారుబస్తీలో ఇద్దరు గల్లంతయ్యారు. అఫ్జల్‌సాగర్ నాలాలో మామ, అల్లుడు కొట్టుకుపోయారు. నాలాలో కొట్టుకుపోయిన మామ, అల్లుడి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అఫ్జల్‌సాగర్ నాలాను దాటే క్రమంలో వీరు అందులో పడిపోయారు.