ePaper
More
    HomeతెలంగాణHyderabad Musi | హైదరాబాద్​లో మూసీ ఉద్ధృతి.. పలు మార్గాల్లో నిలిచిన రాకపోకలు

    Hyderabad Musi | హైదరాబాద్​లో మూసీ ఉద్ధృతి.. పలు మార్గాల్లో నిలిచిన రాకపోకలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Musi | హైదరాబాద్ నగరంలో గురువారం (సెప్టెంబరు 11) సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిశాయి. దీంతో మూసీ నది(Musi River)కి వరద పోటెత్తింది.

    మహా నగరంలోని జంట జలాశయాలు అయిన హిమాయాత్​సాగర్​, ఉస్మాన్​ సాగర్​ (గండిపేట)కు భారీగా వరద(Heavy Flood) వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్ట్​లు నిండుకుండలా మారడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

    జలమండలి అధికారులు ఉస్మాన్ సాగర్ ఆరు గేట్లను ఎత్తి 2,652 క్యూసెక్కులు మూసీలోకి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ 3 గేట్లను 4 ఫీట్ల మేర పైకి ఎత్తి వరద నీటిని మూసీలోకి వదులుతున్నారు.

    Hyderabad Musi | రాకపోకలు నిలిపివేత

    జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో మూసీ నది ఉద్ధృతంగా పారుతోంది. నార్సింగి(Narsingi), మంచిరేవుల మధ్య ఉన్న కల్వర్టు పైనుంచి ఈ వరద నీరు ప్రవహిస్తోంది.

    దీంతో అధికారులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. 100 అడుగుల రోడ్డు మూసీ నది నీటితో నిండిపోయింది. ప్రయాణికులు ఈ మార్గంలో రాకపోకలు సాగించలేకపోతున్నారు.

    పురానా పూల్ నుంచి జియాగూడ కమేలా రోడ్డును అధికారులు మూసివేశారు. కార్వాన్, జియాగూడ, గోపి హోటల్ ద్వారా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.

    ఎగువ నుంచి మూసీలోకి మరింత వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు మున్సిపల్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

    నది పరీవాహక ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. భారీ వరదలతో హయత్ నగర్‌లోని పద్మావతి కాలనీలో ఇల్లు పునాది కొట్టుకుపోయింది. దీంతో భవనం ప్రమాదకరంగా మారింది.

    More like this

    Nepal | నేపాల్ లో భారత టూరిస్టులపై దాడి.. ఆలస్యంగా వెలుగులోకి..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుకి పోయిన నేపాల్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అయితే, ఇటీవల...

    Mohan Bhagwat | భారత్ అంటే భయపడే సుంకాలు.. అమెరికా తీరును ఎండగట్టిన మోహన్ భగవత్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mohan Bhagwat | భారతదేశం బలంగా అభివృద్ధి చెందితే తమకు ఏమి జరుగుతుందోనని అమెరికాకు...

    Stock Market | ఎనిమిది సెషన్లుగా నిఫ్టీ పైపైకి.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Markets) లాభాల బాటలో పయనిస్తున్నాయి....