అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Rains | హైదరాబాద్ మహా నగరం ఒక్క వర్షానికి ఆగమైంది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షానికి(Heavy Rain) నగరం చివురుటాకులా వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు చెరువులను తలపించాయి. వందలాది వాహనాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Hyderabad Rains | వీడని వరద కష్టాలు..
నగరంలో రాత్రి వాన దంచికొట్టడంతో శనివారం ఉదయం కూడా వదర కష్టాలు వీడలేదు. పలు ప్రాంతాల్లో ఇంకా వరద నీరు అలాగే ఉండిపోయింది. మరోవైపు ఈ రోజు కూడా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
Hyderabad Rains | ఐటీ ఏరియాలో..
నగరంలో గచ్చిబౌలి (Gachibowli), కొండాపూర్ (Kondapur), హైటెక్ సిటీ (Hitech City) ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఐటీ జోన్లో అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరే సమయంలో వర్షం పడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గచ్చిబౌలి ప్రాంతంలో రోడ్డుపై నీరు నిలిచి చెరువును తలపించింది. అక్కడ పార్క్ చేసిన వాహనాలు పూర్తిగా నీట మునిగిపోయాయి.
Hyderabad Rains | స్తంభించిన ట్రాఫిక్
ఒక్క వర్షానికి మహా నగరంలో ప్రజలు నరకం చూశారు. వానాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నగరంలో మోస్తరు వానలే తప్ప భారీ వర్షాలు పడలేదు. శుక్రవారం వరుణుడు తన ప్రతాపం చూపడంతో నగరవాసులు నానా అవస్థలు పడ్డారు. నాలాలు ఉప్పొంగాయి. రోడ్లు చెరువులు అయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి వచ్చింది. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రజలు గంటల కొద్ది ట్రాఫిక్‌లో చిక్కుకొని అనేక అవస్థలు పడ్డారు. కంటోన్మెంట్ (Cantonment), బోయిన్పల్లి (Boyinpally)లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది.
Hyderabad Rains | కూలిన గోడ.. తప్పిన ప్రమాదం
భారీ వర్షానికి నగరంలో చాలా చోట్ల చెట్లు నేలకొరిగింది. గోడలు కూలిపోయాయి. చాంద్రాయణ్ గుట్టలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్ సెంటర్ (Central Reserve Police Force Group Centre) ప్రహరీ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. చాలా ప్రాంతాల్లో గోడలు కూలిపోయాయి. హైడ్రా(Hydraa), జీహెచ్ఎంసీ(GHMC), ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.
View this post on Instagram