ePaper
More
    HomeతెలంగాణHyderabad | హైదరాబాద్​లో భారీ వర్షం.. చెరువులను తలపించిన రోడ్లు

    Hyderabad | హైదరాబాద్​లో భారీ వర్షం.. చెరువులను తలపించిన రోడ్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​ నగరంలో గురువారం తెల్లవారు జామున భారీ వర్షం(Heavy Rain) కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచి చెరువులను తలపించాయి.

    మియాపూర్, హైదర్ నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గ్, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మైలార్​దేవ్ పల్లి, ఆరాంఘర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్, కిస్మత్పూర్, హైదర్ షాకోట్, హిమాయత్ సాగర్ తదిత ప్రాంతాల్లో వర్షం కురిసింది. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి(Lingampalli Railway Underbridge) కింద భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు నేడు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department Officers) హెచ్చరించారు.

    More like this

    Indian Railway Jobs | పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వే(Indian Railway)లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఈస్టర్న్‌...

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...