- Advertisement -
Homeజిల్లాలుహైదరాబాద్Hyderabad Rains | హైదరాబాద్​లో భారీ వర్షం.. ట్రాఫిక్​ పోలీసుల కీలక సూచన

Hyderabad Rains | హైదరాబాద్​లో భారీ వర్షం.. ట్రాఫిక్​ పోలీసుల కీలక సూచన

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Rains | మహా నగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి భాగ్య నగరంలో వర్షం పడుతూనే ఉంది.

హైదరాబాద్​ (Hyderabad)లో శుక్రవారం కూడా మోస్తరు వర్షాలు (Rain) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ట్రాఫిక్​ పోలీసులు (Traffic Police) కీలక సూచనలు చేశారు. ఐటీ కంపెనీలు శుక్రవారం తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం (Work From Home) ఇవ్వాలని పోలీసులు సూచించారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజా భద్రత, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం వర్క్​ ఫ్రం హోం ఇచ్చి సహకరించాలని కోరారు. ప్రజలు కూడా అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలన్నారు.

- Advertisement -

Hyderabad Rains | నీట మునిగిన రహదారులు

భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులు సైతం నీట మునిగాయి. అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఖైరతాబాద్‌, నాంపల్లిలో భారీ వర్షం పడింది. దీంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

Hyderabad Rains | జలాశయాలకు భారీగా వరద

నగరంలో కురుస్తున్న వర్షాలతో హిమాయత్​ సాగర్​, ఉస్మాన్​ సాగర్​ (గండిపేట) జలాశయాలకు భారీగా వరద వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్ట్​లు నిండుకుండలా మారడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ (Hussain Sagar)​కు సైతం ఇన్​ఫ్లో వస్తోంది. హుస్సేన్​ సాగర్​ నీటి మట్టం 513.45 మీటర్లకు చేరింది. 680 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. 895 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News