HomeతెలంగాణHeavy rain in Hyderabad | హైదరాబాద్​లో దంచికొడుతున్న వాన.. ఆ ప్రాంతాల్లో కుంభవృష్టి

Heavy rain in Hyderabad | హైదరాబాద్​లో దంచికొడుతున్న వాన.. ఆ ప్రాంతాల్లో కుంభవృష్టి

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain in Hyderabad : బుధ, గురువారాల్లో భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని భారత వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు హైడ్రా కూడా హైదరాబాద్​ ప్రజలను అప్రమత్తం చేసింది.

ఈ మేరకు మహా నగరాన్ని మేఘం పూర్తిగా కమ్మేసింది. కుండతో పోసినట్లు కుమ్మరిస్తుందేమోననే భయాన్ని రేకెత్తించింది. దీని భయానికి ప్రైవేటు కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్​ work from home ప్రకటించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను పెందరాలే వదిలేశాయి. ఇక బడులు, కాలేజీలు అయితే సగం రోజుకే పరిమితమయ్యాయి.

Heavy rain in Hyderabad : అందరినీ ఆగం చేసి..

అందరినీ ఇంతలా భయపెట్టిన మేఘం మాత్రం వర్షించకుండా ముఖం చాటేసింది. కానీ, శుక్రవారం (ఆగస్టు 15) రాత్రి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షం దంచికొడుతోంది.

కూకట్​పల్లి, జగద్గిరిగుట్ట, మూసాపేట్, జేఎన్టీయూ, నిజాంపేట్ ప్రాంతాల్లో కుమ్మేస్తోంది. ప్రగతినగర్​లో మళ్లీ వరద ఏరులై పారుతోంది. రాత్రి తొమ్మిది గంటలకు చిన్నగా మొదలైన వాన మెళ్లిగా పెరుగుతూ పోయింది. కుంభవృష్టిని కురిపిస్తోంది.

సికింద్రాబాద్, బొల్లారం, అల్వాల్, బోయినపల్లి, ప్యాట్నీ, మారేడుపల్లి, జవహర్ నగర్, చిలకలగూడ, తిరుమలగిరి ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది.