అక్షరటుడే, వెబ్‌డెస్క్: Heavy Rain | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీ వర్షం పడుతోంది. శుక్రవారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాన కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, శేరిలింగంపల్లి, కంటోన్మెంట్, హకీంపేట, ఖైరతాబాద్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
భారీ వర్షంతో (Heavy Rain) లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో జీహెచ్‌ఎంసీ, జలమండలి, హైడ్రా సిబ్బంది(Hydra Staff) అప్రమత్తమయ్యారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు నగరంలో వర్షం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.