ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Hyderabad City | హైదరాబాద్‌లో భారీ వర్షం

    Hyderabad City | హైదరాబాద్‌లో భారీ వర్షం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad City | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో తెలంగాణ (Telangana) వ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచే పలు జిల్లాల్లో జల్లులు కురిశాయి. సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా హైదరాబాద్​ (Hyderabad) నగరంలో వాన దంచి కొడుతోంది. నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

    హైదరాబాద్​లో సోమవారం కూడా భారీ వర్షం పడింది. రాత్రి 7 గంటల నుంచి 11 వరకు వాన పడడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ రోజు కూడా వాన పడుతుండడంతో రోడ్లపై నీరు నిలిచి చెరువులను తలపిస్తోంది. దీంతో ట్రాఫిక్​ జామ్ (Traffic Jam) అయి వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. నగరంలో రాత్రి వరకు వర్షం పడే ఛాన్స్​ ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    More like this

    Mirai Review | మిరాయ్ రివ్యూ.. తేజ స‌జ్జా ఖాతాలో మ‌రో హిట్ చేరిందా?

    నటీనటులు : తేజ సజ్జ, మంచు మనోజ్, రితిక నాయక్, శ్రియా శరన్, జగపతి బాబు, జైరాం, గెటప్...

    Global markets mood | జోరుమీదున్న గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global markets mood : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) జోరుమీదున్నాయి. అన్ని ప్రధాన మార్కెట్లు లాభాలతో...

    Lonely Journey | ప్రయాణం ఒంటరిదే కానీ.. ప్రయోజనాలు అనేకమాయే!

    అక్షరటుడే, హైదరాబాద్ : Lonely Journey | ఒంటరిగా ప్రయాణించడం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు. అది...