HomeUncategorizedHeavy Rain | ఢిల్లీలో భారీ వర్షం.. విమాన రాకపోకలకు అంతరాయం

Heavy Rain | ఢిల్లీలో భారీ వర్షం.. విమాన రాకపోకలకు అంతరాయం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారు జామున వరకు కుండపోత వాన పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. వర్షాల నేపథ్యంలో విమాన (Planes) రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 100 కి పైగా విమానాలు ఆలస్యంగా వచ్చాయి. కొన్ని విమానాలను అధికారులు రద్దు చేశారు.

Heavy Rain | జలమయమైన రోడ్లు

సెంట్రల్​ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, మధుర రోడ్ వంటి రద్దీగా ఉండే రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఉదయం కూడా వర్షం పడుతుండటంతో ట్రాఫిక్​ జామ్ (Traffic Jam)​తో నరక యాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు రక్షా బంధన్​ కావడంతో ట్రాఫిక్​లో బయటకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు.

Heavy Rain | ఎల్లో అలెర్ట్ జారీ

నగరంలో రోజంతా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు ప్రయాణించే ముందు విమాన షెడ్యూల్‌లను తనిఖీ చేయాలని, రోడ్లపై ట్రాఫిక్​ తగ్గట్లుగా ప్లాన్​ చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ, బ్లాక్ చేయబడిన రోడ్ల విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలన్నారు. ఘజియాబాద్, నోయిడా, తూర్పు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలకు ఆగస్టు 11, 12 తేదీల్లో భారీ వర్షాలు పడుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. హిమాచల్​ ప్రదేశ్​ (Himachal Pradesh)లోని కొన్ని జిల్లాలకు ఆగస్టు 11, 12 తేదీల్లో ఆరెంజ్​ అలెర్ట్​ జారీ చేశారు.