ePaper
More
    HomeతెలంగాణWeather Updates | నేడు భారీ వర్ష సూచన

    Weather Updates | నేడు భారీ వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు(Heavy Rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ today weather updates అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం heavy rains in Telangana కురిసింది. మెదక్​, కామారెడ్డి, నిజామాబాద్​, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షం పడింది. దీంతో వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి.

    పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం తర్వాత దక్షిణ, మధ్య తెలంగాణ(South and Central Telangana) జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో మోస్తరు వానలు కురిసే ఛాన్స్​ ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్(Hyderabad city)​ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా.. మంగళవారం మహా నగరంలో భారీ వర్షం పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన దారులన్నీ వరద నీటితో నిండిపోయాయి.

    Weather Updates | అటు ఆనందం.. ఇటు ఆందోళన

    ముందస్తు వర్షాలతో రైతులు(Farmers) ఆనంద పడుతున్నారు. పొలం దుక్కి దున్నే పనుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాలేదు. దీంతో వర్షానికి ధాన్యం తడిసిపోతుంది. ధాన్యం విక్రయించని రైతులు వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వాన పడుతుండటంతో వడ్లు తడిసి మొలకెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం (congress Government) స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని అన్నదాతలు పలు ప్రాంతాల్లో ధర్నాలు కూడా చేపడుతున్నారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...