ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Rain Alert | నేడు భారీ వర్ష సూచన

    Rain Alert | నేడు భారీ వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం(Heavy Rains in Telangana) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) అధికారులు తెలిపారు.

    ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad city today weather)​ నగరంలో మధ్యాహ్నం తర్వాత వానలు పడుతాయని పేర్కొన్నారు. పలు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణీ ప్రభావంతో తెలంగాణ(Telangana)లోని ఇతర జిల్లాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉందన్నారు. కాగా సోమవారం పలుచోట్ల కుండపోత వాన పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. షాబాద్​లో 80 మిల్లీమీటర్లు, కేతిరెడ్డిపల్లిలో 75.8, మొయినాబాద్లో 70 మి.మీ. వర్షపాతం నమోదైంది. గంట వ్యవధిలోనే రికార్డు స్థాయిలో వర్షం పడటం గమనార్హం.

    అటు ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh)​లో సైతం భారీ వర్షాలకు అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సముద్రం ముందుకు వచ్చింది. అంతర్వేది, కేశనపల్లి, కరవాక, చింతలమోరిలో అలల ఉధృతి కొనసాగుతోంది. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...