అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు heavy rains పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ Meteorological Department తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వాన పడొచ్చని పేర్కొంది. రాత్రిపూట భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రానున్న 24 గంటలు తెలంగాణ వ్యాప్తంగా వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ hyderabad లో చెదురుమదురు వానలు పడొచ్చని తెలిపారు.
Weather | ఎండలు మండుతాయనుకుంటే..
ఈ ఏడాది మార్చి నుంచే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మార్చి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు temperatures భారీగా నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మార్చి march, ఏప్రిల్ april నెలల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలంటే భయపడ్డారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచి కొట్టడంతో మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడ్డారు. కానీ సీన్ రివర్స్ అయింది. మే ప్రారంభం నుంచి వాతావరణం weather రోజుకో తీరు ఉంటోంది.
Weather | పగలు ఎండ.. రాత్రి వాన
మే నెలలో ఇప్పటి వరకు పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కానీ ప్రజలు భయపడ్డ స్థాయిలో ఎండలు లేవు. పగలు ఎండ తీవ్రత అధికంగా ఉండగా.. సాయంత్రం కాగానే వాతావరణం చల్లబడుతోంది. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంటుంది. వాతావరణంలో తేమతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఉష్ణోగ్రతలు మాత్రం తక్కువగానే నమోదవుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట వర్షాలు rains పడుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలు thunderstorms పడుతుండటంతో ఎండల ప్రభావం అంతగా లేదనే చెప్పాలి.
Weather | అన్నదాతల అవస్థలు
గత కొన్ని రోజులుగా ఏదో ఒక ప్రాంతంలో వర్షం పడుతుండడంతో రైతులు farmers అవస్థలు పడుతున్నారు. అప్పటివరకు మాములుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై భారీ వర్షం పడుతోంది. దీంతో ఆరబెట్టిన ధాన్యం paddy తడిసిపోతోంది. మళ్లీ ధాన్యాన్ని ఆరబెట్టడానికి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పలు జిల్లాలో కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.