ePaper
More
    HomeతెలంగాణWeather Updates | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    Weather Updates | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (IMD) తెలిపారు.

    తెలంగాణలో వారం రోజులుగా వాతావరణం పొడిగా ఉంటుంది. చిరు జల్లులు మినహా భారీ వర్షాలు పడలేదు. వరంగల్ (Warangal)​ జిల్లాలో ఇటీవల కుండపోత వాన కురిసింది. మిగతా ప్రాంతాల్లో వానలు లేవు. అయితే మంగళవారం నుంచి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

    Weather Updates | ఆ జిల్లాలకు అలెర్ట్​

    నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం కుండపోత వానలు పడే ఛాన్స్​ ఉందని అధికారులు హెచ్చరించారు. ఆదిలాబాద్​, నిర్మల్​, ఆసిఫాబాద్​, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్​, సిద్దిపేట, మెదక్​, భువనగిరి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్​, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. సాయంత్రం, రాత్రి పూట వాన పడుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

    Weather Updates | హైదరాబాద్​ నగరంలో..

    హైదరాబాద్​  (Hyderabad) నగరంలో సైతం సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురిసే ఛాన్స్​ ఉంది. ప్రజలు సాయంత్రం పూట అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.

    రాష్ట్రంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి గురువారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 12న సైతం మోస్తరు వర్షాలు పడే ఛాన్స్​ ఉంది. 13, 14 తేదీల్లో తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

    Weather Updates | రైతుల ఆందోళన

    పలు జిల్లాల్లో 15 రోజుల క్రితం వర్షం బీభత్సం సృష్టించింది. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీంతో రైతులు (Farmers) ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 10 నుంచి 20 రోజుల్లో పంటలు చేతికి రానున్నాయి. ఈ సమయంలో భారీ వర్షాలు పడితే దిగుబడి తగ్గుతుందని భయపడుతున్నారు.

    More like this

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల 1989–90 బ్యాచ్​ పదో...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...