ePaper
More
    HomeతెలంగాణHeavy Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    Heavy Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Alert | రాష్ట్రవ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో రాష్ట్రంలో మూడు, నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ (Warangal)​, నల్గొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ నగరాన్ని వరద ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ముంపు బాధితులు పునరావావస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు ఈ రోజు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

    అల్ప పీడన ప్రభావంతో గురువారం ఉదయం నుంచే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వికారాబాద్​, మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్​, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్​, ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, నిర్మల్​ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు.

    Heavy Rain Alert | హైదరాబాద్​ నగరంలో..

    హైదరాబాద్ (Hyderabad)​ మహా నగరాన్ని వర్షం వీడటం లేదు. గత నాలుగు రోజులుగా నిత్యం వర్షం పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ట్రాఫిక్​లో చిక్కుకుంటున్నారు. ఈ రోజు కూడా మధ్యాహ్నం వరకు నగరంలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత మోస్తరు వానలు పడుతాయి. నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడడంతో ట్రాఫిక్​ పోలీసులు ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. ఈ రోజు ఐటీ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోమ్ (Work From Home)​ ఇవ్వాలని కంపెనీలను కోరారు. అలాగే జీహెచ్​ఎంసీ (GHMC) పరిధిలో పాఠశాలలు సైతం మధ్యాహ్నం వరకే కొనసాగనున్నాయి.

    Heavy Rain Alert | పాఠశాలలకు సెలవు

    పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్​ జారీ చేశారు. దీంతో అధికారులు ఆయా జిల్లాల్లో పాఠశాలలకు గురువారం సెలవులు (Holiday) ప్రకటించారు. మెదక్​, సంగారెడ్డి, వికారాబాద్​, ఖమ్మం, వరంగల్​, జనగామ, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్​ జిల్లాల్లో బడులకు సెలవు ఇచ్చారు. మరోవైపు ప్రజలు సైతం అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు. చెరువులు, నదులు, వాగులు, ప్రాజెక్ట్​ల వద్దకు వెళ్లొద్దన్నారు.

    Latest articles

    Shilpa Shirodkar | మ‌హేష్ బాబు మ‌ర‌ద‌లి కారుని ఢీకొట్టిన బ‌స్సు.. తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shilpa Shirodkar | ఒకప్పుడు బాలీవుడ్‌లో ప్రముఖ కథానాయికగా వెలిగిన శిల్పా శిరోద్కర్‌కి చెందిన...

    YS Jagan | జ‌గ‌న్‌కు షాక్‌.. పులివెందుల‌లో ఓట‌మి.. జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో డిపాజిట్ కూడా ద‌క్క‌లే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి షాక్ త‌గిలింది. వైఎస్...

    Presidents Medals | తెలంగాణలో ఇద్దరికి రాష్ట్రపతి పతకాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Presidents Medals | స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల్లో పని చేస్తున్న అధికారులకు...

    Coolie Movie Review | కూలీ మూవీ రివ్యూ.. మ‌ల్టీ స్టారర్ మూవీ ప్రేక్ష‌కుల‌ని మెప్పించిందా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Movie Review | సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) న‌టించిన తాజా చిత్రం...

    More like this