అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం వాతావరణం పొడిగా ఉంటుంది. వాతావరణంలో తేమ, వేడితో ఉక్కపోతగా ఉంటుంది. సాయంత్రం తర్వాత భారీ వర్షాలు పడనున్నాయి.
ముఖ్యంగా దక్షిణ, మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వానలు పడనున్నాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో మంగళవారం సాయంత్రం వర్షం పడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రాత్రి కుండపోత వాన కురిసే అవకాశం ఉంది.
Weather Updates | దంచికొట్టిన వాన
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో సాయంత్రం పూట కుండపోత వానతో (Hyderabad Rains) నగర వాసులు అనేక ఇబ్బందులు పడ్డారు. రెండు గంటల పాటు కురిసిన వానతో నగరం చివురటాకుల వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అనేక అవస్థలు పడ్డారు. గంటల కొద్ది రోడ్లపై నరకయాతన అనుభవించారు. హైదరాబాద్‌తో పాటు సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సైతం వర్షం కురిసింది. నాలుగైదు రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. అయితే పలు జిల్లాల్లో మాత్రం వర్షం పడకపోవడంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.