ePaper
More
    HomeతెలంగాణRain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

    బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా మూడు రోజులుగా వానలు పడుతున్న విషయం తెలిసిందే. బుధవారం పలు జిల్లాల్లో మోస్తరు వాన కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చినుకులు పడుతూనే ఉన్నాయి.

    Rain Alert | విస్తారంగా వానలు

    రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్​, నిజామాబాద్​, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో ఉదయం నుంచే వర్షం పడే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని అధికారులు తెలిపారు. గద్వాల్​, వనపర్తి, నారాయణపేట్​, వికారాబాద్​ జిల్లాల్లో సైతం వానలు పడుతాయి.

    Rain Alert | హైదరాబాద్​ నగరంలో..

    హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్​ ఉంది. బుధవారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది.

    Rain Alert | పిడుగుపాటుకు ఆరుగురు మృతి

    రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం పిడుగులు పడ్డాయి. నిర్మల్ (Nirmal)​ జిల్లా పెంబి మండలంలో గుమ్మనుయోంగ్లాపూర్‌లో పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందారు. బండారి వెంకటి, అల్లెపు ఎల్లయ్య, అల్లెపు ఎల్లవ్వ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గద్వాల (Gadwal) జిల్లా అయిజ మండలం భూంపురం గ్రామంలో పత్తి చేనులో పడిగు పడింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు.

    More like this

    Karnataka | ఇదేం విచిత్రం.. పులిని పట్టలేదని.. అటవీ సిబ్బందిని బోనులో బంధించిన గ్రామస్తులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో పులి భ‌యాందోళ‌న‌కు గురి చేస్తుండా, అటవీ శాఖ...

    Rohit Sharma | రోహిత్ అభిమానుల‌కి గుడ్ న్యూస్.. తాజా పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి...

    CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో కలకలం.. తుపాకితో బెదిరించి దోపిడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బార్బడోస్‌లో...