ePaper
More
    HomeతెలంగాణWeather Updates | రానున్న 24 గంటలు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    Weather Updates | రానున్న 24 గంటలు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి శనివారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. శనివారం రోజంతా వర్షం పడుతూనే ఉంది. ఆదివారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

    రాష్ట్రంలో రానున్న 24 గంటలు అతి భారీ వర్షాలు పడతాయి. ఆదివారం సాయంత్రం, రాత్రి పూట కుండపోత వాన కురిసే ఛాన్స్​ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్​, జయశంకర్​ భూపాలపల్లి, హన్మకొండ, కరీంనగర్​, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్​, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్​, నిర్మల్​ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.

    ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, మంచిర్యాల, జనగామ, భువనగిరి, వికారాబాద్​, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్​ ఉంది. హైదరాబాద్​ నగరంలో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడుతాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

    Weather Updates | ప్రాజెక్ట్​లకు జలకళ

    నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్ (Project)​లకు భారీగా వరద వస్తోంది. ఇప్పటికే కృష్ణనదిపై గల ప్రాజెక్ట్​లు నిండగా.. లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. మరోవైపు గోదావరిపై గల శ్రీరామ్​ సాగర్​ (Sriram Sagar) ప్రాజెక్ట్​కు భారీగా వరద వస్తోంది. వరద ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో ప్రాజెక్ట్​ నిండనుంది. ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ (Flood Canal) ద్వారా మిడ్​ మానేరుకు నీటిని తరలిస్తున్నారు. మిడ్​ మానేర్​, లోయర్​ మానేరు సైతం జలకళను సంతరించుకున్నాయి. మంజీరపై గల సింగూరు (Singuru) డ్యామ్​కు  వరద కొనసాగుతుండడంతో ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నిజాంసాగర్ (Nizam Sagar)​కు ఇన్​ఫ్లో కొనసాగుతోంది. జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

    Latest articles

    Rajasthan | ప్రియురాలి కోసం భార్య‌ని హ‌త్య చేసిన బీజేపీ నేత‌.. డ్రామా ఆడి క‌వ‌ర్ చేసే య‌త్నం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajasthan | ప్రియురాలితో కలిసి జీవించేందుకు తన కట్టుకున్న భార్యనే (Wife) అత్యంత దారుణంగా...

    Rajinikanth | రాజ‌కీయ తుపాను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి నా ధ‌న్య‌వాదాలు.. ర‌జ‌నీకాంత్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) తన సినీ జీవితంలో...

    Harish Rao | కాళేశ్వరం మోటార్లు నాశనం చేసే కుట్ర.. హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కాంగ్రెస్​ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project)​ మోటార్లు నాశనం...

    Anita Bose | సుభాష్ చంద్ర‌బోస్ అస్తిక‌ల‌ని ఇండియాకి తెప్పించండి.. కూతురి విన్న‌పం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anita Bose | భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Subash chandrabose)...

    More like this