ePaper
More
    HomeతెలంగాణHeavy Rain Alert | రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    Heavy Rain Alert | రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Heavy Rain Alert | అన్నదాతలకు వాతావరణ శాఖ(Meteorological Department) చల్లని కబురు చెప్పింది. నేటి నుంచి రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయిని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ(Telangana)లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్​, ఆసిఫాబాద్, నిర్మల్​, మంచిర్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయి. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్​ ఉంది. మిగతా జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.హైదరాబాద్(Hyderabad)​లో ఆదివారం అక్కడక్కడ చెదురుమదురు వానలు పడతాయి. సోమ, మంగళవారాల్లో ముసురుతో కూడిన తేలికపాటి – మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

    READ ALSO  Nizamabad Collector | ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి

    Heavy Rain Alert | గోదావరికి పెరగనున్న వరద

    ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా నది(Krishna River)పై గల జూరాల ఇప్పటికే నిండగా.. శ్రీశైలానికి భారీగా వరద వస్తోంది. శ్రీశైలం రెండు విద్యుత్​ కేంద్రాల్లో ఉత్పత్తి చేసి దిగువకు నీటిని వదులుతుండటంతో నాగర్జున సాగర్(Nagarjuna Sagar)​కు సైతం ఇన్​ఫ్లో వస్తోంది. వరద లేక గోదావరి వెలవెలబోతోంది. అయితే ఈ నెల 9 నుంచి గోదావరిలోకి భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర(Maharashtra)లోని విదర్భలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెన్​గంగా, విదర్భ, వెన్​గంగా, పెద్దవాగు, శబరి వాగులకు వరద ఉధృతి పెరగనుంది. దీంతో గోదావరికి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

    Latest articles

    Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌ అడుగుపెట్టారు. టెక్‌ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ...

    TTD | తిరుమలలో పెరిగిన రద్దీ.. 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు ​

    అక్షరటుడే, తిరుమల: TTD: కళియుగ దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధికి భక్తులు రద్దీ భారీగా పెరిగింది. దీంతో తిరుమల Tirumala...

    Malnadu Drugs Case | మల్నాడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో డ్రగ్స్‌ కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    Cabinet | నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చకు రానున్న కీలక అంశాలు

    అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief...

    More like this