అక్షరటుడే, హైదరాబాద్: Rain Alert | తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (The Indian Meteorological Department – IMD) భారీ వర్ష సూచన జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో.. హైదరాబాద్(Hyderabad), నిజామాబాద్(Nizamabad), వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ(Meteorological Department) సూచించింది.