ePaper
More
    HomeతెలంగాణRain Alert | తెలంగాణకు భారీ వర్ష సూచన

    Rain Alert | తెలంగాణకు భారీ వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. ఈదురుగాలులతో కూడిన వాన పడే ఛాన్స్​ ఉందని పేర్కొన్నారు. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐదు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. నిత్యం వానాలు పడుతుండటంతో అన్నదాత (Farmers)లు సాగు పనుల్లో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే నారుమడులను సిద్ధం చేసుకున్న రైతులు.. మరికొన్ని రోజుల్లో వరినాట్లు ప్రారంభించనున్నారు. వర్షాలు పడుతుండటంతో పొలాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.

    Rain Alert | ఆ జిల్లాలకు అలర్ట్​

    రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్​నగర్​, నారాయణపేట్​, నాగర్​కర్నూల్​, గద్వాల్​, మెదక్​, కామారెడ్డి, వనపర్తి జిల్లాల్లో కుండపోత వాన పడొచ్చని తెలిపింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు పడే ఛాన్స్​ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురు వానలు పడతాయి.

    Rain Alert | హైదరాబాద్​లో..

    హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో నిత్యం వాన పడుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పాటి వానకే రహదారుల్లో ట్రాఫిక్​ జామ్​ (Traffic Jam) అవుతుంది. శుక్ర, శనివారాల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం సాయంత్రం కూడా నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...