ePaper
More
    HomeతెలంగాణWeather Updates | తెలంగాణకు భారీ వర్ష సూచన

    Weather Updates | తెలంగాణకు భారీ వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Weather Updates | తెలంగాణలో భారీ వర్షాలు(Heavy Rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది. రాష్ట్రంలో గత మూడు రోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో మొన్నటి వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అయితే మూడు రోజులుగా రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. అక్కడకక్కడా చిరు జల్లులు కురిసినా భారీ వర్షాలు పడలేదు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    Weather Updates | రైతులు బిజీబిజీ

    మూడు రోజులుగా వర్షాలు లేకపోవడంతో రైతులు(Farmers) పొలం పనుల్లో బిజీగా మారారు. దుక్కులు దున్ని నేలను సిద్ధం చేసుకుంటున్నారు. వర్షం పడితే దుక్కులు రావు. దీంతో అన్నదాతలు భూములను సిద్ధం చేసుకునే పనుల్లో బిజీ అయ్యారు. మరోవైపు రైతులు తుకాలు పోస్తున్నారు. దీంతో విత్తనాల విక్రయ దుకాణాల్లో సందడి నెలకొంది.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...