అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షం (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా నాలుగు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు కూడా వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, రంగారెడ్డి, గద్వాల్, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత వర్షాలు పడుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Weather Updates | హైదరాబాద్‌లో..
భువనగిరి, జనగామ, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపలపల్లి జిల్లాల్లో చెదురుమొదురు వానలు పడుతాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురిసే ఛాన్స్ ఉంది.
Weather Updates | భారీ వర్షంతో ఇబ్బందులు
పలు జిల్లాల్లో గురువారం వాన దంచి కొట్టింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడింది. ముఖ్యంగా కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, జనగామ, భువనగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. భారీ వర్షానికి మెదక్ పట్టణం జలమయం అయింది. తోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా పారుతున్నాయి. యాదాద్రిలో భారీ వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో భువనగిరి-చిట్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో సైతం భారీ వర్షం పడింది. హయత్‌నగర్‌లోని బంజారా కాలనీలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Weather Updates | వర్షపాతం వివరాలు..
రాష్ట్రంలో గురువారం 8:30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు అత్యధికంగా ములుగు (Mulugu) జిల్లా మల్లంపల్లిలో 217 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. కరీంనగర్ జిల్లా ఇందుర్తిలో 211.3, మెదక్ జిల్లా కేంద్రంలో 198.5, రంగారెడ్డి జిల్లా యాచారంలో 180.3, సిద్దిపేట జిల్లా గండిపల్లిలో 179.3, కోహెడలో 169.8, మెదక్ జిల్లా రాజ్‌పల్లిలో 159.5 మి.మీ. వర్షం కురిసింది.