అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో వారం రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అక్కడక్కడ మాత్రమే వానలు పడుతున్నాయి.
ఆగస్టు చివరలో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసిన విషయం తెలిసిందే. అనంతరం వరుణుడు శాంతించాడు. దీంతో సెప్టెంబర్ ప్రారంభం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వానలు మాత్రమే కురిశాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి పూట వాన పడే ఛాన్స్ ఉందని తెలిపారు.
Weather Updates | పెరగనున్న వేడి
రాష్ట్రంలో నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతాయి. మిగతా జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉండనుంది. ఉదయం నుంచే ఉక్కపోత ఉంటుంది. ఈ నెల 9 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
Weather Updates | రైతుల ఆందోళన
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలో భారీ నష్టం జరిగింది. వేలాది విద్యుత్ స్తంభాలు (Electricity poles) నేలకొరిగాయి. ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయాయి. దీంతో అధికారులు విద్యుత్ లైన్లను పునరుద్ధరిస్తున్నారు. అయితే గ్రామాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. కానీ పలు గ్రామాల్లో ఇప్పటికీ వ్యవసాయ బావులకు వెళ్లే కరెంట్ లైన్ల మరమ్మతులు పూర్తి కాలేదు. దీంతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు 27 నుంచి కరెంట్ లేదు. నాలుగైదు రోజులుగా ఎండలు పెరగడం, ప్రస్తుతం వరి పంట పొట్ట, ఈనిక దశలో ఉండటంతో నీరు అవసరం అని అన్నదాతలు చెబుతున్నారు. అధికారులు స్పందించి వేగంగా మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. లేదంటే పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.