అక్షరటుడే, వెబ్‌డెస్క్: Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి వేడి, తేమతో ఉక్కపోతగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. ఉత్తర, మధ్య, పశ్చిమ తెలంగాణలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుంది. అయితే పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండనుంది.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీ ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
Weather Updates | కుండపోత వాన
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతగా ఉండగా.. ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి, భువనగిరి, గద్వాల్, వికారాబాద్ జిల్లాల్లో మోస్తారు వాన పడింది. హైదరాబాద్ (Hyderabad) లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బోరబండ, యూసుఫ్‌గూడ, శ్రీనగర్‌కాలనీ ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
Weather Updates | ‘మీ ప్రాంతంలో వర్షం పడనుంది’ టీసీసీసీ నుంచి మెస్సేజ్‌లు
వర్షం పడుతుందో లేదోనని ప్రజలు వార్తల ద్వారా తెలుసుకుంటారు. ప్రస్తుతం అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో గూగుల్‌లో వెదర్ రిపోర్ట్ చూస్తారు. అయితే తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ (Telangana Command Control Center) వర్షాలపై ప్రజలకు సందేశాలు పంపుతోంది. మరికొద్ది సేపట్లో మీ ప్రాంతంలో వర్షం పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి అంటూ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పలువురికి మంగళవారం మెసేజ్‌లు వచ్చాయి.