అక్షరటుడే, వెబ్డెస్క్ : Rain Alert | తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల్, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి.
సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో మధ్యాహ్నం, సాయంత్ర వేళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఉదయం నుంచే వర్షాలు కురుస్తున్నాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత వర్షాలు కురుస్తాయి.
Rain Alert | అప్పటి వరకు వర్షాలు
రాష్ట్రాన్ని వరుణుడు వీడటం లేదు. వర్షాకాలం ముగిసినా.. వానలు పడుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైతులకు పంట నష్టం జరుగుతోంది. ఈ వానాకాలం సీజన్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. అయితే నవంబర్ 7 వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు. అప్పటి నుంచి చలి తీవ్రత పెరుగుతుందని చెప్పారు.
Rain Alert | కొనుగోళ్లలో జాప్యం
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారు. వర్షానికి ధాన్యం తడిసి మొలకలు వస్తుందని, ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.
