అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (IMD) తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట్, వనపర్తి, గద్వాల్, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు జల్లులు కురుస్తాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం, రాత్రి వేళలో అక్కడక్కడ వర్షం పడే ఛాన్స్ ఉంది.
Weather Updates | ఆ జిల్లాల్లో వర్ష బీభత్సం
తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వాన దంచికొట్టింది. హైదరాబాద్ నగరంలో సైతం వర్షం పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల వరి, మొక్కజొన్న, సోయాబీన్ పంటలను కోసి రైతులు ఆరబెడుతున్నారు. రాత్రి వర్షం పడటంతో పంటలు తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Weather Updates | వర్షపాతం వివరాలు
నల్గొండ జిల్లా కన్గల్ సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి మంగళవారం ఉదయం 5 గంటల వరకు అత్యధికంగా 111 మి.మీ. వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా వనల్పహడ్లో 105.3, ముదోల్లో 93.3, నల్గొండ జిల్లా రేగులగడ్డలో 102.8, హాలియాలో 83.3, జగిత్యాల జిల్లా జగ్గాసాగర్లో 82.3 మి.మీ. వర్షపాతం నమోదు అయింది.