HomeతెలంగాణHyderabad | హైదరాబాద్​కు భారీ వర్ష సూచన.. వర్క్ ఫ్రం హోం​ ఇవ్వాలని పోలీసుల సలహా

Hyderabad | హైదరాబాద్​కు భారీ వర్ష సూచన.. వర్క్ ఫ్రం హోం​ ఇవ్వాలని పోలీసుల సలహా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​ నగరంలో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) హెచ్చరించారు. గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వానలతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్​ పోలీసులు (Cyberabad Police) కీలక సూచనలు జారీ చేశారు.

వర్ష సూచన నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు మంగళవారం వర్క్​ ఫ్రం హోం​ ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ మేరకు సోషల్​ మీడియా వేదికగా పోస్ట్​ పెట్టారు. నగరంలో నాలుగు రోజులుగా సాయంత్ర భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. దీంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే వారు ట్రాఫిక్​లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్ కమిషనరేట్​ (Cyberabad Commissionerate) పరిధిలో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్​ఫ్రం హోం​ ఇవ్వాలని పోలీసులు సూచించారు.

Hyderabad | అనవసర ప్రయాణాలు వద్దు

వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు కూడా అనవసర ప్రయాణాలు చేయద్దని పోలీసులు కోరారు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి పూట అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు. అయితే ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం (Work From Home)​ ఇవ్వాలని పోలీసులు ఉదయం సూచించడంపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఈ రోజు వర్క్​ ఫ్రం ఇవ్వాలని ఉదయమే చెబితే ఎలా అంటున్నారు. అలా చేయడం కుదరని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Must Read
Related News