అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rain Alert | ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ(Meteorological Department) చల్లని వార్త చెప్పింది. శనివారం సాయంత్రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం(Heavy Rain) కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం రంగారెడ్డి, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది.
రానున్న రెండు గంటల్లో వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట్, మెదక్, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి, గద్వాల్, నారాయణ్‌పేట జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వాన పడొచ్చని తెలిపింది.