HomeతెలంగాణSriram Sagar | ఎస్సారెస్పీకి భారీగా వరద.. 37 గేట్లు ఎత్తివేత

Sriram Sagar | ఎస్సారెస్పీకి భారీగా వరద.. 37 గేట్లు ఎత్తివేత

- Advertisement -

అక్షరటుడే, మెండోరా : Sriram Sagar |ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​కు ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 37 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

రాష్ట్రంలో, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి (Godavari)కి భారీగా వరద వస్తోంది. దీంతో ఎస్సారెస్పీలోకి 1.90 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. మంగళవారం 1.70 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో రాగా.. బుధవారం మరింత పెరిగింది. దీంతో అధికారులు దిగువకు నీటి విడుదలను భారీగా పెంచారు. 37 గేట్లు ఎత్తి 2,58,705 క్యూసెక్కులు వదులుతున్నారు.

Sriram Sagar | కాలువల ద్వారా నీటి విడుదల

ప్రాజెక్ట్​ ఎస్కేప్​ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద కాలువకు 6,735, కాకతీయ కాలువకు 4 వేలు, సరస్వతి కాలువకు 800, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిడ్​ మానేరు (Mid Manair), లోయర్​ మానేరు డ్యాం (LMD)లు నిండటంతో వరద కాలువ ద్వారా నీటి విడుదలను తగ్గించారు. మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 701 క్యూసెక్కుల నీరు పోతోంది.

Sriram Sagar | క్రమంగా తగ్గుతున్న నీటిమట్టం

శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు వరద పోటెత్తడంతో అధికారులు నీటి విడుదలను భారీగా పెంచారు. ఇన్​ఫ్లో కంటే ఔట్​ఫ్లో అధికంగా ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో జలాశయం నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 1.90 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 2,75,372 క్యూసెక్కుల ఔట్​ఫ్లో ఉంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1088.1 (70.14 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. గోదావరిలోకి భారీగా నీటిని వదులుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.