Homeజిల్లాలునిజామాబాద్​Sriram Sagar | ఎస్సారెస్పీకి భారీగా వరద.. 39 గేట్లు ఎత్తివేత

Sriram Sagar | ఎస్సారెస్పీకి భారీగా వరద.. 39 గేట్లు ఎత్తివేత

అక్షరటుడే, మెండోరా: Sriram Sagar | శ్రీరాం​సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద (Heavy Flood) వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు సోమవారం 39 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Sriram Sagar | మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు..

మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి (Godavari) భారీగా వరద వస్తోంది. దీంతో ఎస్సారెస్పీలోకి రూ.4,09,500 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు దిగువకు నీటి విడుదలను భారీగా పెంచారు. 39 గేట్లు ఎత్తి రూ.4,00,000 క్యూసెక్కులు వదులుతున్నారు.

Sriram Sagar | కాల్వల ద్వారా నీటి విడుదల

ప్రాజెక్ట్ ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కుల వరదను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు 4,000, సరస్వతి కాలువకు (Saraswati Canal) 400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 581 క్యూసెక్కులు పోతోంది. అయితే వరద కాలువ, లక్ష్మి కాలువ, అలీసాగర్​ ఎత్తిపోతలకు (Alisagar lift irrigation) నీటి విడుదల నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

Sriram Sagar | క్రమంగా తగ్గుతున్న నీటిమట్టం

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriramsagar project) వరద పోటెత్తడంతో అధికారులు నీటి విడుదలను భారీగా పెంచారు. ఇన్​ఫ్లో కంటే అవుట్​ఫ్లో అధికంగా ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో జలాశయం నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 4.09,500 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 4,09,212 క్యూసెక్కులు అవుట్​ఫ్లో ఉంటుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1,083.40 (54.88 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. గోదావరిలోకి భారీగా నీటిని వదులుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Must Read
Related News