More
    HomeతెలంగాణSriram Sagar | ఎస్సారెస్పీకి భారీగా వరద.. పెరుగుతున్న నీటిమట్టం

    Sriram Sagar | ఎస్సారెస్పీకి భారీగా వరద.. పెరుగుతున్న నీటిమట్టం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sriram Sagar | శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​ (SRSP)కు భారీగా వరద వస్తోంది. నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. దీంతో ప్రాజెక్ట్​లోకి భారీగా ఇన్​ఫ్లో వస్తోంది. ఆదివారం ఉదయ 20 వేల క్యూసెక్కుల వరద రాగా సాయంత్రానికి 50 వేల క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రాజెక్ట్​లోకి 52,765 క్యూసెక్కుల వరద వస్తోంది.

    దీంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1070.50 (24.23 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది. ప్రాజెక్ట్​ నుంచి కాకతీయ ప్రధాన కాలువ (Kakatiya Canal)కు వంద క్యూసెక్కులు, మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

    Sriram Sagar | రైతుల హర్షం

    ఉత్తర తెలంగాణ జిల్లాల వర ప్రదాయిని శ్రీరాంసాగర్​కు భారీగా వరద వస్తుండడంతో రైతులు (Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్​ ప్రారంభం అయినప్పటి నుంచి ఈ రోజే భారీగా వరద వచ్చింది. మొన్నటి వరకు రెండు, మూడు వేల క్యూసెక్కులు మాత్రమే ఇన్​ఫ్లో నమోదు కాగా.. ప్రస్తుతం 50 వేలు దాటడంతో రైతులు ఆనంద పడుతున్నారు. ప్రాజెక్ట్​ నిండితే రెండు పంటలకు ఢోఖా ఉండదని పేర్కొంటున్నారు.

    More like this

    CPM Nizamabad | తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు

    అక్షరటుడే, ఇందూరు: CPM Nizamabad | తెలంగాణ సాయిధ పోరాట వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి...

    Team India | టీమిండియాకి కొత్త స్పాన్స‌ర్ వ‌చ్చేశారు.. ఇక నుండి జెర్సీలు ఎలా ఉండ‌నున్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Team India | భారత క్రికెట్ ప్రేమికులకు తాజా అప్‌డేట్! టీమిండియా క్రికెట్ జెర్సీపై ఇకపై...

    Birkur | గుడి డబ్బులు వడ్డీతో సహా చెల్లిస్తా: బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్

    అక్షరటుడే, బాన్సువాడ: Birkur | బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానానికి (Telangana Tirumala Tirupathi) సంబంధించి రూ.25 లక్షలు...