HomeతెలంగాణSrisailam Project | శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

Srisailam Project | శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో(Heavy Rains) కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో జురాల ప్రాజెక్ట్​ (Jurala Project) నిండుకుండలా మారింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాల నుంచి వచ్చిన నీటితో శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) భారీగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్​లోకి 1,71,208 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. 67,399 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్​ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.7 టీఎంసీలు కాగా ప్రస్తుతం 179.8995 టీఎంసీల నీరు ఉంది.