అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు (Sriramsagar project) ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి (Godavari) వరద పోటెత్తింది. ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం అంతేనీటిమట్టంతో నిండుకుంలా ఉంది. దీంతో అధికారులు 22 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
Sriram Sagar | నీటి విడుదల వివరాలు
ప్రాజెక్ట్ నిండుకుండలా ఉండటం, ఎగువ నుంచి భారీగా వరద (heavy flood) వస్తుండటంతో అధికారులు దిగువకు నీటి విడుదలను పెంచారు. ఇన్‌ఫ్లో కంటే ఔట్ ఫ్లో అధికంగా ఉండేలా చర్యలు చేపట్టారు. 22 వరద గేట్ల ద్వారా 89,860 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 8 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5 వేలు, కాకతీయ కాలువకు 3 వేలు, సరస్వతి కాలువకు 800, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథకు (Mission Bhagiratha) 231, ఆవిరి రూపంలో 684 క్యూసెక్కుల నీరు పొతోంది. మొత్తం 1,07,595 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదు అవుతోంది.
Sriram Sagar | కొనసాగుతున్న జల విద్యుదుత్పత్తి
శ్రీరామ్‌సాగర్ దిగువన గల జల విద్యత్ కేంద్రంలో (hydroelectric power station) ఉత్పత్తి కొనసాగుతోంది. నాలుగు టర్బయిన్ల ద్వారా జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు గోదావరిలోకి, కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, గోదావరీ పరీవాహక రైతులు సైతం నది సమీపంలోకి వెళ్లొద్దని కోరారు.