అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sriram Sagar | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ నుంచి భారీగా వరద (Heavy flood) వస్తోంది. దీంతో జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
మహారాష్ట్ర (Maharashtra), స్థానికంగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి భారీగా ఇన్‌ఫ్లో (heavy inflow) వస్తోంది. జలాశయంలోకి ప్రస్తుతం 3,68,226 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అధికారులు 12 వరద గేట్లను ఎత్తి 35,293 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 6,735 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా నాలుగు వేలు, కాకతీయ కాలువకు (Kakatiya canal) 4 వేలు, సరస్వతి కాలువకు 400, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. ఆవిరి రూపంలో 701 క్యూసెక్కుల నీరు పోతుంది. మొత్తం ఔట్ ఫ్లో 51,560 క్యూసెక్కులుగా ఉంది.
Sriram Sagar | పెరుగుతున్న నీటిమట్టం
ప్రాజెక్ట్ అధికారులు నిన్నటి వరకు ఇన్‌ఫ్లో కంటే ఔట్ ఫ్లో అధికంగా ఉంచారు. దీంతో జలాశయం నీటిమట్టం తగ్గింది. ప్రస్తుతం దిగువకు నీటి విడుదలను భారీగా తగ్గించారు. దీంతో జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. గురువారం ప్రాజెక్ట్‌లో 66 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం 73.37 టీఎంసీలకు చేరింది. వరద గేట్లు, కాలువల (flood gates and canals) ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో గోదావరి, కాలువల పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.