Homeజిల్లాలుకామారెడ్డిNizam Sagar | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద.. నాలుగు గేట్ల ద్వారా నీటి విడుదల

Nizam Sagar | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద.. నాలుగు గేట్ల ద్వారా నీటి విడుదల

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizam Sagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్ (Nizam Sagar)​కు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

ఉమ్మడి మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మంజీర (Manjeera) నదికి వరద పెరిగింది. ప్రస్తుతం నిజాంసాగర్​లోకి 22 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు నాలుగు వరద గేట్లను ఎత్తి అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.80 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1404 (17. 78 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్​ అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతిని పరిశీలిస్తూ దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Nizam Sagar | పొంగిపొర్లుతున్న పోచారం

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు (Pocharam Project)లోకి ఇన్​ఫ్లో కొనసాగుతోంది. మెదక్​, కామారెడ్డి జిల్లాల్లో కురిసిన వర్షాలతో పెద్దవాగు, గుండారం వాగు, పాముల వాగు ద్వారా డ్యామ్​లోకి భారీగా వరద వస్తోంది. జలాశయంలోకి 6 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన కాలువకు 50 క్యూసెక్కుల వదులుతున్నారు. మిగతా నీరు అలుగుపై నుంచి పారుతోంది.

Nizam Sagar | పర్యాటకులకు నో ఎంట్రీ..

పోచారం జలాశయం పొంగి పొర్లుతుండటంతో అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. అయితే ఎగువ నుంచి వరద కొనసాగుతుండటం, వర్షాలు పడుతుండటంతో అధికారులు డ్యామ్​ వద్దకు ఎవరిని అనుమతించడం లేదు.

Nizam Sagar | ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రాజెక్టును డీఈ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. ఆ ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి ఆదేశాలిచ్చారు. వర్షాలు, వరదలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోలెవెల్ వంతెనల వద్ద ప్రమాదకర ప్రయాణాలు చేయవద్దని పోలీసులు పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎవరూ ఉండొద్దని అధికారులు సూచించారు.

Must Read
Related News