అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nagarjuna Sagar | ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది (Krishna River) పరవళ్లు తొక్కుతోంది. దీంతో నాగార్జున సాగర్‌కు భారీగా వరద వస్తోంది. ప్రాజెక్ట్ నిండుకుండలా మారడంతో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (Adluri Laxman Kumar) గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదలను ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.6 అడుగులకు నీరు చేరింది. ఎగువన నుంచి 2,01,743 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో మంగళవారం ఉదయం 11:30 గంటలకు మంత్రులు, నాగర్జున సాగర్ ఎమ్మెల్యే రఘువీర్‌రెడ్డి కృష్ణమ్మ హారతి ఇచ్చి గేట్లు ఎత్తారు.
Nagarjuna Sagar | 18 ఏళ్ల తర్వాత..
ప్రస్తుతం కృష్ణానదికి భారీగా వరద వస్తోంది. దీంతో ఆ నదిపై గల జూరాల (Jurala), శ్రీశైలం(Srisailam), నాగార్జున సాగర్ నిండుకుండల్లా మారాయి. అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. నాగర్జున సాగర్ దిగువన గల పులిచింతల ప్రాజెక్ట్ కూడా వరద ఇలాగే కొనసాగితే రెండు, మూడు రోజుల్లో నిండే అవకాశం ఉంది. అయితే జులైలో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడం 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. దిగువకు నీటిని వదలడంతో నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉందడాలని అధికారులు సూచించారు.
Nagarjuna Sagar | శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
ఎగువన కురిసిన వర్షాలతో శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లోకి 2,39,601 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 2,28,900 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదు అవుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 883 అడుగుల(204.7 టీఎంసీలు)కు నీరు చేరింది. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు.
#Telangana—-#NagarjunaSagar gates open after 18 years
With massive inflows from upstream, the #reservoir is full to the brim.
Ministers @UttamINC & Adluri Laxman, along with officials, opened the crest gates to release #floodwaters.#NagarjunaSagar #Telangana #WaterRelease… pic.twitter.com/5E2kVPSnzY
— NewsMeter (@NewsMeter_In) July 29, 2025