HomeతెలంగాణJurala Project | జూరాలకు భారీ వరద.. 10 గేట్ల ఎత్తివేత

Jurala Project | జూరాలకు భారీ వరద.. 10 గేట్ల ఎత్తివేత

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jurala Project | జూరాల ప్రాజెక్టుకు భారీగా శుక్ర‌వారం భారీగా వ‌ర‌ద వ‌చ్చి చేరుతోంది. దీంతో 10 గేట్లు ఎత్తి నీటిని దిగువ‌కు వ‌దులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల‌తో కృష్ణ‌మ్మ ప‌రుగులు పెడుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు(Jurala Project)కు 71 వేల క్యూసెక్కుల వ‌రద వ‌చ్చి చేరుతోంది. ఈ నేప‌థ్యంలోనే 10 గేట్లు ఎత్తి దిగువ‌కు నీటిని విడుదల‌ చేస్తున్న‌ట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు(Executive Engineer Venkateswara Rao) తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమ‌ట్టం 9.657 టీఎంసీలు కాగా ప్ర‌స్తుతం 7.535 టీఎంసీల నీరు నిల్వ ఉంద‌ని చెప్పారు. 10 గేట్లు ఎత్తి 73 వేల క్యూసెక్కుల‌ను దిగువ‌కు వ‌దులుతున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.

Jurala Project | బోసిపోయిన గోదావ‌రి

కృష్ణ బేసిన్‌లో వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో కృష్ణ‌(Krishna), తుంగ‌భ‌ద్ర న‌దులు(Tungabhadra River) జ‌ల‌క‌ళ సంత‌రించుకున్నాయి. 20 రోజుల క్రితం కురిసిన వ‌ర్షాల‌తో రెండు న‌దులు పోటెత్తాయి. అయితే, తెలంగాణ(Telangana)కు జీవ‌నది అయిన గోదావ‌రి మాత్రం బోసిపోయింది. ఎగువ‌న ఉన్న మ‌హారాష్ట్ర(Maharashtra)తో పాటు తెలంగాణ‌లోనూ వ‌ర్షాలు కుర‌వ‌డం లేదు. వ‌ర్షాకాలం ప్రారంభ‌మైన 20 రోజుల‌వుతున్నా ఇప్ప‌టికీ స‌రైనా వాన‌లు ప‌డ‌లేదు. దీంతో గోదావ‌రి(Godavari) బోసిపోయి క‌నిపిస్తోంది.