అక్షరటుడే, ఆర్మూర్: Umamaheswara Temple | ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజాంసాగర్ (Nizamsagar), శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు (Sriram project) వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు.
కాగా.. గోదావరి (Godavari) నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరీవాహక ప్రాంతంలోని ఆలయాల్లోకి నీళ్లు చేరాయి. నందిపేట(nandipet) మండలం ఉమ్మెడ గ్రామ శివారులోని ఉమామహేశ్వర ఆలయం శిఖరం వరకు గోదావరి నీళ్లు వచ్చాయి. ఆలయం చుట్టూ భారీగా వరద నీరు చేరడంతో శిఖరాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు.