అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drunk drive | డ్రంకన్ డ్రైవ్లో పలువురికి జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ (Traffic Inspector Prasad) ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 40 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లుగా గుర్తించారు. వారికి కౌన్సిలింగ్ నిర్వహించి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Second Class Magistrate) నూర్జహాన్ ఎదుట హాజరుపర్చారు.
విచారించిన న్యాయమూర్తి 32 మందికి రూ.10,000 చొప్పున రూ.3,20,000 జరిమానా విధించారు. అలాగే 8 మందికి జైలుశిక్ష వేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మాట్లాడుతూ మద్యంతాగి వాహనాలు నడిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైక్లు నడిపే ప్రతిఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు.
Comments are closed.