అక్షరటుడే, బాన్సువాడ: NTR Death Anniversary | విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ వర్ధంతిని ఉమ్మడి జిల్లాలో ఆదివారం నిర్వహించారు. ఈ మేరకు ఎన్టీఆర్ చిత్రపటాలు, విగ్రహాలకు నివాళులర్పించారు.
NTR Death Anniversary | బీర్కూర్ మండల కేంద్రంలో..
బీర్కూర్ మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్థంతిని (NTR Death Anniversary) నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ అరిగే ధర్మతేజ, ఉప సర్పంచ్ పరమేష్ పంతులు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీష్, ఓంకార్, రమణ, ఆనంద్ కుమార్, బస్వరాజు తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్లో..
మండలంలోని తిమ్మాపూర్లో ఆదివారం ఎన్టీఆర్ అభిమాన సంఘం (NTR Fans Association) ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. ఎన్టీఆర్ సినీ రంగానికి చేసిన విశిష్ట సేవలను, రాజకీయ రంగంలో ప్రజల కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.
సామాన్యుల గుండెల్లో నిలిచిన వ్యక్తి..
సామాన్యుల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడిగా, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అభిమానులు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ జీవితం నేటి తరానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి తెలుగు బిడ్డపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్, వీర్రాజు, వెంకటేష్, చరణ్ తేజ, శ్రీకాంత్, నాగేశ్వరరావు, రవి, ప్రసాద్, భాస్కర్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
