అక్షర టుడే, ఇందూరు: Nizamabad GGH | ఆర్బీఎస్కే, అపోలో హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 19న పిల్లలకు గుండె వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి రాజశ్రీ (District Medical and Health Officer Rajshri) పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
నవజాత శిశువు నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు గుండె వైద్య శిబిరం (heart medical camp) నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. జీజీహెచ్‌లోని రూం.నంబ31లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరం ఉంటుందన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ బ్రాంచ్‌లో ఉచితంగా శస్త్ర చికిత్స చేయబడుతుందని పేర్కొన్నారు. శిబిరానికి హాజరయ్యేవారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పిల్లల జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆరోగ్య రికార్డులను తీసుకురావాలని సూచించారు.
