అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLA Defection | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణను స్పీకర్ కార్యాలయం వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ (Congress)లో చేరిన పది మందిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్పీకర్ విచారణ చేపడుతున్నారు.
అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జులై 31న సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు చెప్పింది. ఈ క్రమంలో స్పీకర్ గతంలో నలుగురు ఎమ్మెల్యే (MLA)లను విచారించారు. ఈ నెల 6, 7 తేదీల్లో రెండో విడతలతో మరో నలుగురిని విచారించారు. వారిని మళ్లీ ఈ నెల 12, 13 తేదీల్లో విచారించాల్సి ఉంది. అయితే ఇవాళ, రేపు జరగాల్సిన విచారణను వాయిదా వేసినట్లు స్పీకర్ కార్యాలయం (Speaker Office) తెలిపింది.ఈ నెల 14, 15 తేదీల్లో విచారిస్తామని వెల్లడించింది. నవంబర్ 6న తెల్లం వెంకట్రావ్, సంజయ్‌ల పిటిషన్లనుచ 7న పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy), అరికెపూడి గాంధీల పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టారు.
MLA Defection | ముగిసిన గడువు
అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన గడువు అక్టోబర్ 31తో ముగిసింది. దీంతో మరికొంత సమయం కావాలని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు స్పీకర్ గడువులోగా నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని బీఆర్ఎస్ (BRS) దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. దీనిపై సోమవారం విచారణ చేపడుతామని న్యాయస్థానం తెలిపింది. అప్పటిలోగా స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. దీంతో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
