HomeUncategorizedSupreme Court | కంచ గచ్చిబౌలి భూములపై విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం

Supreme Court | కంచ గచ్చిబౌలి భూములపై విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court | సుప్రీంకోర్టులో కంచ గచ్చిబౌలి భూముల కేసు విచారణ బుధవారం జరిగింది. సీజేఐ బీఆర్​ గవాయ్ ​(CJI BR Gavai) ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా చీఫ్​ జస్టిస్​ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణం, వన్యప్రాణుల ప్రయోజనాలు కాపాడుతూ నష్టాలను తగ్గించే చర్యలు తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని 400 ఎకరాల భూమిని చదును చేసి వేలం ద్వారా విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచించిన విషయం తెలిసిందే. అయితే ఆ భూమి హెచ్​సీయూకు చెందిందని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మరోవైపు విపక్షాలు, పర్యావరణ ప్రేమికులు సైతం కంచ గచ్చిబౌలిలో అడువులను నాశనం చేస్తున్నారని నిరసన తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించగా.. స్టే విధించింది. ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించింది.

Supreme Court | ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

కంచ గచ్చిబౌలి భూముల్లో (Kancha Gachibowli Land) పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ధర్మాసనం సూచించింది. ఆ భూముల్లో పర్యావరణ పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న ప్రణాళిక సమర్పించేందుకు ఆరు వారాల గడువు కోరింది. దీంతో సీజేఐ పర్యావరాణ పరిరక్షణకు సరైన చర్యలు తీసుకుంటే ప్రశంసిస్తామన్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలను సైతం ఉపసంహరించుకుంటామని చెప్పారు. అనంతరం విచారణను ఆరు వారాలకు వాయిదా వేశారు. కాగా.. జులై 23న విచారణ సందర్భంగా కోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టకపోతే అధికారులను జైలుకు పంపిస్తామని హెచ్చరించింది.