అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : Medicover Hospital | మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా తక్కువ ధరకే పూర్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.1947కే నిజామాబాద్ నగరంలోని మెడికవర్ ఆస్పత్రిలో (Medicover Hospital) పూర్తి ఆరోగ్య పరీక్షలు చేస్తామని వారు వివరించారు. ‘వందేమాతరం హెల్త్ చెకప్ ప్యాకేజీ’ (Vande Mataram Health Checkup Package) పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చినట్లు వారు స్పష్టం చేశారు. ప్యాకేజీలో.. పరీక్షలు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ (CUE), ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్(కొలెస్ట్రాల్), లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్ఎఫ్టీ), ఎక్స్-రే చెస్ట్ (విత్‌అవుట్ ఫిలిం), ఈసీజీ, 2డీ ఎకో, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ (పీఎఫ్‌టీ), హెచ్‌బీఏ–1సీ, సీరం యూరియా, అల్ట్రాసౌండ్ స్కానింగ్ (అబ్డొమెన్ & పెల్విస్), సీరం క్రియాటినిన్ ఉంటాయని వివరించారు.
ప్యాకేజీలో కన్సల్టేషన్లు (Consultations), కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, డైటీషియన్ అందుబాటులో ఉంటారన్నారు. ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 15, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని.. వివరాల కోసం 04068334455లో సంప్రదించవచ్చని వారు వివరించారు.