అక్షరటుడే, ఎల్లారెడ్డి: Medical Camp | ఎల్లారెడ్డి మండలంలోని (Yellareddy Mandal) వెల్లుట్లపేటలో సోమవారం కొయ్యల రాజాగౌడ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ (Hyderabad) మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో రాజాగౌడ్ ప్రోత్సాహంగా వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.
ఈ శిబిరంలో ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు వైద్యులు గ్రామస్థులకు పలు రకాల చికిత్సలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ ఈ శిబిరం ఏర్పాటు చేసినందుకు కొయ్యాల రాజా గౌడ్‌ను గ్రామస్థులు అభినందించారు.
