అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PV Sindhu | ఆరోగ్య పరీక్షలను కీలకంగా చూడాలని, అప్పుడే క్రీడలతోపాటు రోజువారీ జీవితంలో కూడా దీర్ఘకాలిక పనితీరును కొనసాగించవచ్చని ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు (Olympic medalist PV Sindhu) అన్నారు. జూబ్లీహిల్స్‌లోని (Jubilee Hills) జీవీకే డయాగ్నోస్టిక్స్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ మొదటి వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ఆమె మాట్లాడారు. క్రమశిక్షణ, త్వరితగతిన కోలుకోవడం, ఎదురుదెబ్బలు తగలకుండా ముందస్తు చర్యల ప్రాముఖ్యత గురించి సింధు వివరించారు.
జీవీకే కుటుంబానికి (GVK family) చెందిన కేశవ రెడ్డి, వీణా రెడ్డితో జరిగిన ముఖాముఖిలో సంభాషణ సరదాగా మొదలై అనేక విషయాలను చర్చించారు.
PV Sindhu | ఐస్‌క్రీమ్‌ను వదిలేయడం కష్టమే
ఒలింపిక్ పతకం (Olympic medal) గెలవడం కంటే ఐస్‌క్రీమ్‌ను వదిలేయడం కష్టమా అని అడిగినప్పుడు సింధు ఇలా అన్నారు. పతకాలు గెలవడం కష్టమే, కానీ ఐస్‌క్రీమ్ వదిలేయడం మరింత కష్టంగా అనిపిస్తుందని పేర్కొన్నారు. అయితే, క్రమశిక్షణ, కోలుకోవడం, ఆరోగ్య జాగ్రత్తలే తనను ఈ క్రీడలో నిలబెట్టాయన్నారు. ఆటల్లో ఫిట్నెస్ టెస్ట్‌లకు (fitness tests) ఎంతో ప్రాధాన్యం ఇస్తామన్నారు. జీవితంలో కూడా ఆరోగ్య పరీక్షలకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎంత కష్టపడి శిక్షణ ఇస్తున్నాం అనేది ముఖ్యం కాదని, ఎప్పుడు ఎక్కువ కష్టపడాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఎన్.జి. శాస్త్రి (Dr. N.G. Shastri) వంటి ప్రముఖ వైద్య నిపుణులతో ఇంటరాక్టివ్ చర్చ కూడా జరిగింది.
PV Sindhu | అనేక సేవలు
మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని జీవీకే డయాగ్నోస్టిక్స్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ రోగుల అవసరాలకు ఒక సమగ్ర పరిష్కారంగా నిలిచింది. ఇక్కడ 17 స్పెషాలిటీలలో ఓపీడీ కన్సల్టేషన్లు, సమగ్ర డయాగ్నోస్టిక్స్, డే కేర్ సర్జరీలు, నివారణ సంరక్షణ సేవలు అందిస్తోంది.