అక్షరటుడే ఇందల్వాయి: collector Nizamabad | విద్యార్థులకు పక్షం రోజులకొకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. డిచ్పల్లి (Dichpally) మండలం ధర్మారం(బి) (Dharmaram) గ్రామంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలతో పాటు, అంగన్వాడీ సెంటర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. ముందుగా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుండగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
collector Nizamabad | నాణ్యమైన భోజనం అందించాలి
గురుకులంలో 640 మంది విద్యార్థినులు ఉండగా, వారికి నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ సూచించారు. మెనూను పరిశీలించి, తదనుగుణంగా ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా అని పరిశీలించారు. అనంతరం ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతిరోజూ కోడిగుడ్డు అందించాలని సూచించారు.
ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కింద నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిపి వేయడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని, విద్యార్థుల నమోదుతో పాటు క్రమం తప్పకుండా వారు బడికి వచ్చేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు.
హెల్త్క్యాంప్ను పరిశీలిస్తున్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి