అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నిజామాబాద్ నగరంలోని బోర్గాం(పి) (Borgaon (P)) జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం హెల్త్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వ్యాధులపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా చేతుల పరిశుభ్రత, పౌష్టికాహారం లోపం, సీజనల్ వ్యాధులు (seasonal diseases), అంటు వ్యాధులు తదితర అంశాలపై వివరించారు. జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ అజ్మల్ విద్యార్థులకు పరిశుభ్రత, మానసిక పరిపక్వత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్, హెల్త్ సూపర్వైజర్ రవీందర్, ఏఎన్ఎం లత, ఆశ వర్కర్లు సరోజ, లక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Nizamabad City | బోర్గాం(పి) పాఠశాలలో ఆరోగ్యంపై అవగాహన